ఈడెన్‌లో కేకేఆర్‌తో మ్యాచ్.. టాస్ గెలిచిన పంత్ సేన
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో అజింక్య రహానే నేతృత్వంలోని కోల్‌కతా జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది.
టాస్ గెలిచిన అనంతరం లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడుతూ.. "మేము బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తున్నాం. మా బౌలర్లపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గత మ్యాచ్‌లో విజయం జట్టులో ఉత్సాహాన్ని నింపింది. ఈ మ్యాచ్‌లో ఎలాంటి మార్పులు లేకుండా అదే జట్టుతో బరిలోకి దిగుతున్నాం" అని తెలిపాడు.
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే మాట్లాడుతూ.. "మేము కూడా బౌలింగ్ చేయాలనే అనుకున్నాం. జట్టులో ఒకే ఒక మార్పు చేశాం. బ్లెస్సింగ్ ముజరబానీ స్థానంలో సునీల్ నరైన్ జట్టులోకి వచ్చాడు. కామెరూన్ గ్రీన్ బౌలింగ్ కూడా చేస్తే, మా బౌలింగ్ విభాగం మరింత పటిష్ఠమవుతుంది" అని పేర్కొన్నాడు.
కోల్‌కతా నైట్ రైడర్స్
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, కామెరూన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), రింకు సింగ్, రోవ్‌మన్ పావెల్, రమన్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, నవదీప్ సైనీ, కార్తీక్ త్యాగి.
లక్నో సూపర్ జెయింట్స్
మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రమ్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), నికోలస్ పూరన్, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, మణిమారన్ సిద్ధార్థ్, అవేశ్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేశ్ సింగ్ రాఠీ, ప్రిన్స్ యాదవ్.