హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఇరాన్, దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది.
భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని తెలిపింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నౌకలలో ఉన్న వారు అందులోనే ఉండాలని సూచించింది. అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని కోరింది. అధికారులు, కంపెనీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పంచుకోవాలని తెలిపింది.
ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది.