దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి కస్టడీకి ఏసీబీ పిటిషన్.. నేడు కోర్టులో విచారణ

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఏపీ దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) కళింగిరి శాంతి కస్టడీ పిటిషన్‌పై ఈరోజు విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో విచారణ జరగనుంది. ఈ కేసులో మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఆమెను ఐదు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ నెల 7న ఏసీబీ అధికారులు శాంతిని అరెస్ట్ చేయగా, కోర్టు ఆమెకు ఏప్రిల్ 21 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె విజయవాడ జిల్లా జైలులో ఉన్నారు. అయితే, సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లపై ఆమె సరైన సమాధానాలు ఇవ్వడం లేదని, లోతుగా విచారిస్తే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు.

2020లో గ్రూప్ 1 అధికారిణిగా విధుల్లో చేరిన శాంతి, తక్కువ వ్యవధిలోనే భారీగా ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ ఆరోపిస్తోంది. సోదాల్లో విశాఖపట్నంలో ఒక ఫ్లాట్, తాడేపల్లి సమీపంలోని కుంచనపల్లిలో ఒక జీ ప్లస్ 2 భవనం, సుమారు 770 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, రూ.1.15 లక్షల నగదుతో పాటు పలు ఆస్తులను గుర్తించారు.

Kalingiri Shanti
ACB
Andhra Pradesh
Endowments Department
Disproportionate Assets Case
Corruption
Vijayawada
Assets Seized
Group 1 Officer

More Telugu News