నేను ముందే చూశాను.. మీకు తెలీదు: ట్రోలర్లకు దీపిక ఘాటు సమాధానం

 Deepika Padukone Responds to Trolls About Ranveer Singhs Dhurandhar 2
షార్ట్స్‌లో చూడండి

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ సినిమా సృష్టిస్తున్న ప్రభంజనం అంతా ఇంతా కాదు. ఈ చిత్రం ఏకంగా రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే, భర్త రణ్‌వీర్ సింగ్ సాధించిన ఈ భారీ విజయంపై దీపికా పదుకొణె ఎందుకు స్పందించడం లేదని గత కొన్ని రోజులుగా ట్రోల్స్ వస్తున్నాయి. తాజాగా ఈ విమర్శలపై దీపిక తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.



దీపిక తన భర్త సినిమా ఎందుకు చూడటం లేదు? ఆ సినిమా గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అనే పోస్ట్‌పై ఆమె స్పందించారు. "మీ అందరికంటే ముందే నేను ఆ సినిమాను చూశాను. ఈ విషయం మీకు తెలియదు. ఇప్పుడు చెప్పండి.. ఎవరు ఎవరిని విమర్శించాలి?" అంటూ వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్ట్‌ల ఆధారంగా ప్రేమనో, మద్దతునో కొలవలేమని ఆమె ఈ రిప్లై ద్వారా స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టనంత మాత్రాన తన భర్తకు మద్దతు ఇవ్వడంలేదు అనుకోవడం సరికాదని అన్నారు.


మరోవైపు, ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు ఆర్. మాధవన్, అక్షయ్ ఖన్నా వంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. విడుదలైన రోజు నుండి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూనే ఉంది.

Go Back to Shorts
Deepika Padukone
Ranveer Singh
Dhurandhar 2
Bollywood Movie
Box Office Collection
Aditya Dhar
R Madhavan
Akshay Khanna
Bollywood Success
Deepika Ranveer

More Telugu News