ఇది భారత్ గర్వించదగిన క్షణం: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu Praises Indias PFBR Achievement
షార్ట్స్‌లో చూడండి
కల్పక్కంలో స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ (PFBR) క్రిటికాలిటీని సాధించడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ క్షణమని, దేశ పౌర అణు ప్రస్థానానికి ఇదొక గొప్ప ప్రోత్సాహమని ఆయన అన్నారు. ఈ చరిత్రాత్మక విజయం సాధించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తూ, "భారత అణు కార్యక్రమం రెండో దశలో ఇది ఒక కీలక ముందడుగు. ఈ విజయంతో మన దేశంలో ఉన్న విస్తారమైన థోరియం నిల్వలను మూడో దశలో వినియోగించుకోవడానికి మరింత చేరువయ్యాం" అని వివరించారు. ఈ పరిణామం దేశ దీర్ఘకాలిక ఇంధన భద్రతకు మార్గాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడ్డారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోనే ఇంధన భద్రత దిశగా దేశం బలమైన అడుగులు వేస్తోందని చంద్రబాబు ప్రశంసించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో స్వయం సమృద్ధి సాధించడంలో ఇటువంటి విజయాలు ఎంతో స్ఫూర్తినిస్తాయని ఆయన పేర్కొన్నారు.
Go Back to Shorts
Chandrababu Naidu
PFBR
Prototype Fast Breeder Reactor
Kalpakkam
Nuclear Reactor
India Nuclear Program
Thorium Reserves
Narendra Modi
Energy Security
Andhra Pradesh

More Telugu News