దగ్గరపడుతున్న అమెరికా గడువు... నష్టాల్లో స్టాక్ మార్కెట్
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు విధించిన గడువుకు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో, దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధంపై అనిశ్చితి కొనసాగుతోంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు యుద్ధంపై వెనక్కి తగ్గడం లేదు. అదే సమయంలో కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం వహించి యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లలో అప్రమత్తత కనిపిస్తోంది.
ఉదయం గం.9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 529 పాయింట్లు కోల్పోయి 73,576 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయి 22,813 వద్ద ట్రేడ్ అయింది. ఉదయం గం.10.45 సమయానికి సెన్సెక్స్ 156 పాయింట్లు, నిఫ్టీ 31 పాయింట్ల నష్టాల్లో ట్రేడ్ అయింది.