ఇరాన్ సుప్రీం లీడర్ ఆరోగ్యం విషమం.. అపస్మారక స్థితిలో మోజ్తబా ఖమేనీ!

ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం అపస్మారక స్థితిలో (స్పృహలో లేరని) ఉన్నారని, దేశ పాలనా బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నారని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది మార్చి నెలలో తన తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత మోజ్తబా ఈ పదవిని చేపట్టారు.

ప్రస్తుతం ఆయనకు టెహ్రాన్‌కు బదులుగా పవిత్ర నగరమైన కోమ్‌లో అత్యంత రహస్యంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. భద్రతా కారణాలరీత్యా మోజ్తబాను అక్కడికి తరలించినట్లు నివేదికలు చెబుతున్నాయి. గత కొన్ని రోజులుగా మోజ్తబా బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి.

గత ఫిబ్రవరిలో తన తండ్రి అలీ ఖమేనీ మరణానికి కారణమైన వైమానిక దాడుల్లో మోజ్తబా కూడా తీవ్రంగా గాయపడ్డారని, ఆ గాయాల ప్రభావం నుంచి ఇంకా కోలుకోలేదని గూఢచార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ గాయాల వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందని భావిస్తున్నారు.

అయితే, ఈ వార్తలను ఇరాన్ అధికారిక వర్గాలు ఇంతవరకు ధ్రువీకరించలేదు. మోజ్తబా క్షేమంగానే ఉన్నారని, యుద్ధ వాతావరణం కారణంగా ఓ రహస్య ప్రదేశం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని గతంలో ప్రభుత్వం పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న కీలక సమయంలో దేశ అత్యున్నత నేత ఆరోగ్యంపై వస్తున్న ఈ వార్తలు ఇరాన్‌లో రాజకీయ అనిశ్చితికి దారితీస్తున్నాయి.

Mojtaba Khamenei
Iran Supreme Leader
Iran
Ayatollah Ali Khamenei
Iran health
Khom
Tehran
Iran politics
Middle East tensions

More Telugu News