Kanthamma: చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

Kanthamma loses gold chain in Chittoor district fraud
షార్ట్స్‌లో చూడండి
చిత్తూరు జిల్లాలో కేటుగాళ్లు రెచ్చిపోయారు. ‘జాగ్రత్తగా దాచుకోండి’ అని చెప్పి, ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును చాకచక్యంగా కొట్టేశారు. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరులో సోమవారం ఈ ఘటన వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. కాంతమ్మ అనే స్థానిక మహిళ బ్యాంకు పని మీద బయటకు వచ్చారు. ఆమె బ్యాంకు వద్దకు చేరుకోగానే, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు ఆమెను మాటల్లోకి దించారు. మెడలో బంగారు గొలుసు వేసుకోవడం సురక్షితం కాదని, దాన్ని తీసి భద్రంగా దాచుకోవాలని నమ్మబలికారు. తామే సహాయం చేస్తామంటూ ముందుకు వచ్చి, ఆమె గొలుసును ఒక కాగితంలో చుట్టి ఇచ్చారు.

వారి మాటలు నమ్మిన కాంతమ్మ ఆ పొట్లాన్ని తీసుకుని బ్యాంకు లోపలికి వెళ్లింది. అక్కడ పొట్లం విప్పి చూడగా, అందులో బంగారు గొలుసుకు బదులుగా రాళ్లు ఉండటంతో నిర్ఘాంతపోయింది. తాను మోసపోయానని గ్రహించి గట్టిగా విలపించింది.

బాధితురాలు వెంటనే పెనుమూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ తరహా మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
 
Go Back to Shorts
Kanthamma
Chittoor district
Penumur
gold chain theft
fraud
Andhra Pradesh
crime news
police investigation
Gangadhara Nellore
cheating

More Telugu News