Chandrababu Naidu: పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతుల నుంచి నేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి సమీపంలో ఉన్న పెండేకల్ రిజర్వాయర్ వద్ద ఆయన స్థానిక రైతులతో, వ్యవసాయ కూలీలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఆధునిక సాగు విధానాల వల్ల కలుగుతున్న ప్రయోజనాలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా, రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలు, అనుసరిస్తున్న విధానాలపై నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామల అనే రైతులతో సీఎం మాట్లాడారు. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా కలుగుతున్న లాభాలను పరిమి చరణ్ కుమార్, పాపసాని ముని యుగంధర్‌లు ముఖ్యమంత్రికి వివరించారు. డ్రిప్ పరికరాలను ప్రభుత్వం తమకు 90 శాతం సబ్సిడీపై అందిస్తోందని వారు తెలిపారు.
అలాగే, ‘ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్’ విధానం ద్వారా సాగు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయని హరికృష్ణ, దేవి అనే రైతులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. పొలాల్లో అర్ధచంద్రాకార గుంతలు తవ్వడం ద్వారా నేల సారం పెరిగి మంచి ఫలితాలు వస్తున్నాయని నందిని, ప్రమీలమ్మ అనే మహిళా రైతులు ముఖ్యమంత్రికి వివరించారు. ఉపాధి హామీ, ప్రకృతి వ్యవసాయం వంటి పలు అంశాలపై కూడా సీఎం రైతులతో చర్చించారు.