India Bangladesh Border: బంగ్లాదేశ్ నుంచి చొరబాటులను అడ్డుకోవడానికి.. సరిహద్దులో పాములు, మొసళ్లు!
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి ఉన్న నదీతీర, చిత్తడి నేల ప్రాంతాల్లోకి చొరబాట్లను నివారించడానికి పాములు, మొసళ్లను సహజ నిరోధకంగా ఉపయోగించే అవకాశంపై అంతర్గత చర్చ జరిగిందని బీఎస్ఎఫ్ వర్గాలు తెలిపాయి. అయితే, దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు రాలేదు. బంగ్లాదేశ్ సరిహద్దులో కీలకమైన నదీ పరివాహక ప్రాంతాల్లోకి పాములు, మొసళ్లను వదలాలని సైన్యం యోచిస్తోంది.
అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుందో పరిశీలించాలని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తన ప్రాంతీయ కేంద్రాలకు ప్రతిపాదనలు పంపినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి. సంప్రదాయ కంచెలు ఏర్పాటు చేయడం సాధ్యం కానీ భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని సున్నితమైన ప్రాంతాల కోసం దీనిని పరిశీలిస్తున్నారు. 4,096 కిలోమీటర్ల పొడవైన ఈ సరిహద్దులో దాదాపు 175 కిలోమీటర్ల మేర నదీతీర, చిత్తడి నేలలు ఉన్నాయి. దీనివల్ల కేవలం చొరబాట్లు, స్మగ్లింగ్, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టడం కష్టతరమవుతుంది.
ఈ ప్రతిపాదనల వెనుక కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆలోచన ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, అమలు చేయడానికి కూడా అనేక సవాళ్లు ఉంటాయని చెబుతున్నారు. పాములు, మొసళ్లను సేకరించడం, ఈ ప్రాంత ప్రజలపై వీటి ప్రభావం వంటి అంశాలను అధ్యయనం చేయాల్సి ఉంటుందని మీడియా కథనాలు వెల్లడించాయి.