Pat Cummins: సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ: ఐపీఎల్ మధ్యలోనే స్వదేశానికి వెళ్లిపోయిన ప్యాట్ కమిన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టోర్నీ మధ్యలోనే ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లాడు. కొంతకాలంగా వేధిస్తున్న వెన్నునొప్పికి సంబంధించి చివరి వైద్య స్కాన్ కోసం అతడు స్వదేశానికి పయనమయ్యాడు. దీంతో రాబోయే మరికొన్ని మ్యాచ్‌లకు కమిన్స్ దూరం కానున్నాడు.
వివరాల్లోకి వెళితే, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో గురువారం (ఏప్రిల్ 2) కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై సన్‌రైజర్స్ విజయం సాధించిన వెంటనే కమిన్స్ ఆస్ట్రేలియాకు బయల్దేరాడు. ఈ స్కాన్‌ను ముందుగానే ప్లాన్ చేసినట్లు, క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పర్యవేక్షణలో ఇది జరగనున్నట్లు తెలిసింది. స్కాన్ పూర్తయిన తర్వాత ఏప్రిల్ 17న అతడు తిరిగి సన్‌రైజర్స్ జట్టుతో చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన కమిన్స్ మరో రెండు మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు.
గత యాషెస్ సిరీస్ తర్వాత కమిన్స్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌నకు కూడా దూరమయ్యాడు. ఐపీఎల్ ఆరంభంలోనే, కమిన్స్ ఆడలేడని స్పష్టం కావడంతో సన్‌రైజర్స్ యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా నియమించింది. కమిన్స్ గైర్హాజరీలో మరికొన్ని మ్యాచ్ ల పాటు ఇషాన్ కిషనే జట్టును నడిపించనున్నాడు.
ఇషాన్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ఆడింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడినా, రెండో మ్యాచ్‌లో కోల్‌కతాపై 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి తిరిగి పుంజుకుంది. ప్రస్తుతం రెండు పాయింట్లతో పట్టికలో ఆరో స్థానంలో ఉంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌ను ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆడనుంది. ఇది ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు తొలి హోమ్ మ్యాచ్ కావడం విశేషం.