N Rangasamy: అమ్మాయి పుడితే లక్ష రూపాయిలు... పుదుచ్చేరి సీఎం ఎన్నికల హామీ

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగసామి కీలక ఎన్నికల హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే ఆమె పేరిట రూ.లక్ష ఫిక్స్‌‌డ్ డిపాజిట్ చేస్తామని ప్రకటించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరపట్టిణం ప్రాంతంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆయన ఈ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం తమ ప్రభుత్వం ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ.50 వేలు డిపాజిట్ చేస్తోందని, మళ్లీ అవకాశం ఇస్తే ఆ మొత్తాన్ని రూ.లక్షకు పెంచుతామని రంగసామి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా బాలికల భవిష్యత్తుకు, ఉన్నత విద్యకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మరికొన్ని హామీలు కూడా ఇచ్చారు. మత్స్యకారుల చిరకాల డిమాండ్ అయిన అత్యంత వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) జాబితాలో చేర్చడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, పుదుచ్చేరిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ) ద్వారా రూ.3వేల కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, రానున్న ఎన్నికల్లో గెలిస్తే కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
N Rangasamy
Puducherry
Puducherry election
election promise
fixed deposit scheme
girl child scheme
financial assistance
welfare schemes
MBC
infrastructure development

More Telugu News