LPG Gas Cylinder: వాణిజ్య గ్యాస్‌పై భారీ వాత.. రూ.195 పెరిగిన సిలిండర్ ధర

వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరిగింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్‌పై రూ. 195.50 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు బుధవారం, ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వచ్చాయి. ఈ పెంపుతో ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,078.50కి చేరింది.

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణమని చమురు సంస్థలు వెల్లడించాయి. ఈ తాజా పెంపుతో కోల్‌కతాలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ. 2,208కి ఎగబాకింది. గత నెల, అంటే మార్చి 1వ తేదీన కూడా కమర్షియల్ సిలిండర్‌పై రూ. 114.5 పెంచిన విషయం తెలిసిందే. నెల తిరిగేసరికి మరోసారి ధరలు పెరగడం గమనార్హం. అయితే, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు.
LPG Gas Cylinder
Commercial LPG Price Hike
LPG Price Hike
Gas Cylinder Price
Oil Companies
West Asia tensions
Fuel prices
Delhi LPG price

More Telugu News