Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాకు వయసుతో పాటే బైకులపై ఆసక్తి పెరుగుతూ వచ్చింది: రాజశేఖర్

Rajasekhar Reveals Jeevitha Sold His Bike Without Telling Him
Advertisement
  • నాకు తెలియకుండా నా బైక్‌ను జీవిత అమ్మేసిందన్న రాజశేఖర్
  • 'బైకర్' సినిమా ప్రచార కార్యక్రమంలో పాత జ్ఞాపకాలు వెల్లడి
  • రిస్క్‌తో నడుపుతున్నాననే భయంతోనే జీవిత అలా చేసిందని వివరణ
  • 'శేషు' సినిమా సమయంలో యమహా 650 బైక్ కొన్నానన్న రాజశేఖర్
Advertisement
సీనియర్ నటుడు డాక్టర్ రాజశేఖర్, తన భార్య జీవిత గురించి ఓ సరదా విషయాన్ని మీడియా ముందు పంచుకున్నారు. తనకు ఎంతో ఇష్టమైన బైక్‌ను, తనకు తెలియకుండానే జీవిత అమ్మేశారని ఆయన నవ్వుతూ చెప్పారు. శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'బైకర్' సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా నిన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ ఆసక్తికర సంఘటనను ఆయన వెల్లడించారు.

బైక్స్ అంటే తనకెంత ఇష్టమో వివరిస్తూ, చిన్నప్పటి నుంచి తనకు బైక్స్ అంటే చాలా ఇష్టమని, అమ్మమ్మగారింట్లో బుల్లెట్‌పై ఊరంతా తిరిగేవాడినని ఆయన గుర్తుచేసుకున్నారు. తనకు వయసుతో పాటు బైకులపై కూడా ఆసక్తి పెరుగుతూ వచ్చిందన్నారు. ఆ క్రమంలోనే శేషు సినిమా సమయంలో షూటింగ్ కోసం తాను స్వయంగా యమహా 650 బైక్‌ను కొనుగోలు చేశానని. ఆ తర్వాత కూడా దాన్నే కొన్నాళ్లు నడిపానని చెప్పారు. అయితే, నేను నడిపే విధానం చూసి జీవిత ఆందోళన చెందిందన్నారు. స్పీడ్‌గా డ్రైవ్ చేస్తున్నానని భయపడి తనకు తెలియకుండా జీవిత బైక్ అమ్మేసిందని నవ్వుతూ చెప్పారు.

కాగా, ఏప్రిల్ 3న విడుదల కానున్న 'బైకర్' చిత్రంలో రాజశేఖర్ 'బుల్లెట్ సునీల్' అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ రేసింగ్ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు, తాను 'మగాడు' అనే మరో చిత్రంలో నటిస్తున్నానని, అలాగే తన కుమార్తె శివానితో కలిసి ఓ సినిమాలో కనిపించనున్నట్లు రాజశేఖర్ తెలిపారు.
 
Advertisement
Advertisement
Rajasekhar
Jeevitha
Biker Movie
Sharwanand
Yamaha 650
Bullet Sunil
MotoCross Racing
Magadu Movie
Shivani Rajasekhar

More Telugu News