Radhika Sarathkumar: ఓటీటీలోకి అడుగుపెడుతున్న 75 కోట్ల సినిమా!

Thaai Kizhavi Movie Update
షార్ట్స్‌లో చూడండి
ఓటీటీలోకి అడుగుపెట్టడానికి ఒక తమిళ సినిమా రెడీ అవుతోంది. ఆ సినిమా పేరే 'తాయి కిళవి'. రాధిక ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి, శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా నిర్మాతలలో శివ కార్తికేయన్ ఒకరుగా వ్యవహరించడం విశేషం. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, తొలి రోజునే సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్లింది. 

10 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 75 కోట్ల వరకూ రాబట్టింది. లుక్ పరంగా .. నటన పరంగా రాధిక మంచి మార్కులు కొట్టేసిన ఈ సినిమాలో, మునీశ్ కాంత్ .. సింగం పులి .. అరుళ్ దాస్ .. బాలశరవణన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. అలాంటి ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను 'జియో హాట్ స్టార్' వారు సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ 10వ తేదీ నుంచి తమిళంతో పాటు వివిధ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా ప్రకటించారు. 

కథలోకి వెళితే రాధిక పాత్ర పేరు 'పవనుత్తాయి'. 70 ఏళ్ల వయసున్న ఆమె వడ్డీ వ్యాపారం చేస్తూ ఆస్తిపాస్తులను బాగానే వెనకేస్తుంది. ఆమె అంటే ముగ్గురు కొడుకులకు .. కోడళ్లకు హడల్. అందరినీ భయపెడుతూ బ్రతికేస్తూ వచ్చిన ఆమె, పక్షవాతంతో మంచాన పడుతుంది. మాటపడిపోయిన ఆమె సైగలతో రోజులు నెట్టుకొస్తూ ఉంటుంది. సంపాదించిందంతా ఆమె బంగారంగా మార్చేసి దాచి ఉంచిందని భావించిన కుటుంబ సభ్యులు ఏం చేస్తారు? అనేది కథ. 

Go Back to Shorts
Radhika Sarathkumar
Thaen Kudikaatha
Thaen Kudikaatha Movie
Tamil Movie OTT Release
Jio Hotstar
Siva Karthikeyan
Tamil Cinema
Munish Kanth
Singam Puli
Arul Dass

More Telugu News