Dhurandhar 2: 12 రోజుల్లో రూ.1,390 కోట్లు.. ధురంధర్-2 సరికొత్త రికార్డులు

Dhurandhar 2 Creates New Records with Rs 1390 Crore in 12 Days
షార్ట్స్‌లో చూడండి
ధురందర్-2 చిత్రం వసూళ్ల రికార్డును సృష్టిస్తోంది. 12 రోజుల్లోనే రూ.1,390 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 4లోకి వచ్చింది. అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లతో దంగల్ తొలి స్థానంలో, రూ.1,810 కోట్ల వసూళ్లతో బాహుబలి-2 రెండో స్థానంలో, రూ.1,800 కోట్ల వసూళ్లతో పుష్ప-2 మూడో స్థానంలో నిలిచాయి.

నిన్నటి వరకు ధురంధర్ రూ.1,350 కోట్లతో నాలుగో స్థానంలో ఉండగా, ధురంధర్-2 పన్నెండు రోజుల్లో రూ.1,390 కోట్ల వసూళ్లు సాధించి ఆ చిత్రాన్ని అధిగమించింది. ఈ నెల 19వ తేదీన విడుదలైన ధురంధర్-2 చిత్రం హౌస్ ఫుల్ కలెక్షన్‌లతో దూసుకువెళుతోంది.

ధురంధర్-2 గ్రాస్ కలెక్షన్లు భారతదేశంలో రూ.1,042 కోట్లకు పైగా ఉండగా, ఓవర్సీస్‌లో రూ.350 కోట్లకు పైగా రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్లు రూ.1,392.23 కోట్లుగా ఉన్నాయి. ఇదిలా ఉండగా, కర్ణాటకలో రూ.100 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టిన తొలి హిందీ సినిమాగా ధురంధర్-2 రికార్డు సృష్టించింది. అంతకుముందు, ధురంధర్ పార్ట్ 1 కేవలం హిందీలోనే విడుదలై రూ.1,350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 
Go Back to Shorts
Dhurandhar 2
Dhurandhar 2 collection
Box office collection
Indian movies collection
Highest grossing movies

More Telugu News