Jeethu Joseph: ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో వచ్చిన మలయాళ థ్రిల్లర్!
సాధారణంగా ఏ సినిమాకైనా హీరో ఎవరనేది చూసుకుని థియేటర్స్ కి వెళుతూ ఉంటారు. అయితే దర్శకుడు ఎవరనేది చూసుకుని, థియేటర్ కి వెళ్లడమనేది కొందరి విషయంలో జరుగుతూ ఉంటుంది. అలాంటి దర్శకుల జాబితాలో 'జీతూ జోసెఫ్' పేరు ప్రధానంగా కనిపిస్తూ ఉంటుంది. ఆడియన్స్ గెస్ చేయని విధంగా కథలను మలుపు తిప్పడంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంది. అందువలన ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటారు.
అలాంటి జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన మలయాళ సినిమానే 'వలతు వశతే కల్లన్'. బిజూ మీనన్ - జోజూ జార్జ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ ఏడాది జనవరి 30వ తేదీన థియేటర్లకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమాకి, థియేటర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ నెల 27వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. బిజూ మీనన్ .. జోజు జార్జ్ నటన ఈ సినిమాకి హైలైట్ అనే టాక్ వినిపించింది. భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ఈ కంటెంట్ ను ఫాలో అవుతున్నారు.
కథ విషయానికి వస్తే .. ఆంటోని (బిజూ మీనన్) ఓ పోలీస్ ఆఫీసర్. కొడుకు 'ఫిలిప్' విషయమై అతను ఆందోళన చెందుతుంటాడు. ఒక రోజున అతని దగ్గరికి శామ్యూల్ (జోజూ జార్జ్) వస్తాడు. తన కూతురు 'ఐరీన్' కనిపించకుండా పోయిందని ఫిర్యాదు చేస్తాడు. ఆ తరువాత ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. అయితే ఆ కేసును ఆంటోని పెద్దగా పట్టించుకోడు. దాంతో ఐరీన్ హత్యకీ .. ఆంటోనికి సంబంధం ఉందని శామ్యూల్ భావిస్తాడు. ఆ తరువాత అతను ఏం చేస్తాడు? అనేది కథ.