Nayanthara: వంశీ పైడిపల్లి సినిమాలో సల్మాన్ సరసన నయన్.. అధికారిక ప్రకటన

Nayanthara to star opposite Salman Khan in Vamshi Paidipally film
షార్ట్స్‌లో చూడండి
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రంపై ఓ కీలక అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్‌గా లేడీ సూపర్ స్టార్ నయనతారను ఖరారు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (ఎస్‌వీసీ) బ్యానర్‌పై అగ్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది వారి 63వ చిత్రం (SVC63). ఈ ప్రాజెక్ట్‌లోకి నయనతారకు స్వాగతం పలకడం గౌరవంగా భావిస్తున్నామని, 'ది క్వీన్' అడుగుపెట్టిందని నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఇప్పటికే నయనతార బాలీవుడ్‌లో షారుఖ్ ఖాన్ సరసన 'జవాన్' చిత్రంలో నటించి భారీ బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ఆ సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను సైతం మెప్పించిన ఆమె, ఇప్పుడు మరో అగ్ర కథానాయకుడు సల్మాన్ ఖాన్‌తో జతకట్టడం సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తెలుగు దర్శకుడు, టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ కలిసి చేస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Go Back to Shorts
Nayanthara
Salman Khan
Vamshi Paidipally
Dil Raju
SVC63
Bollywood
Tollywood
Jawan Movie
Pan India Movie
Shree Venkateswara Creations

More Telugu News