Iran: అమెరికా 'అవాక్స్' విమానాన్ని పేల్చివేశాం: ఇరాన్ సంచలన ప్రకటన
అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రస్థాయికి చేరింది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్‌పై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి అమెరికా సైనిక ఆస్తులను ధ్వంసం చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడిలో అమెరికా వాయుసేనకు చెందిన అత్యంత కీలకమైన ఈ-3 సెంట్రీ (AWACS) నిఘా విమానం పూర్తిగా దెబ్బతిన్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన చిత్రాలను కూడా ఇరాన్ అధికారిక మీడియా ప్రెస్ టీవీ విడుదల చేసింది.
మార్చి 27న జరిగిన ఈ దాడిలో సుమారు 6 బాలిస్టిక్ క్షిపణులు, 29 డ్రోన్లను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇరాన్ విడుదల చేసిన చిత్రాల్లో ఈ-3 సెంట్రీ విమానం మధ్య భాగం కాలిపోయి, తల, తోక భాగాలు మాత్రమే మిగిలి ఉన్నట్లు కనిపిస్తోంది. గగనతలం నుంచి నిఘా, శత్రువుల కదలికలను పసిగట్టడంలో ఈ విమానం అమెరికాకు అత్యంత కీలకం. ప్రస్తుతం అమెరికా వద్ద ఇలాంటివి కేవలం 17 విమానాలు మాత్రమే ఉండగా, వాటిలో ఒకటి ధ్వంసం కావడం వ్యూహాత్మకంగా పెద్ద నష్టమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఈ దాడిలో కనీసం 10 మంది అమెరికా సైనికులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. కొన్ని నివేదికలు 15 మంది వరకు గాయపడినట్లు పేర్కొంటున్నాయి. ఈ దాడిలో పలు ఇంధన నింపే విమానాలు (కేసీ-135) కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. అయితే, ఈ ఘటనపై అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ఫిబ్రవరి 28 నుంచి అమెరికా-ఇజ్రాయెల్ కూటమి తమపై యుద్ధం ప్రారంభించిందని, తమ సుప్రీం లీడర్ ఖామెనీని హత్య చేసిందని ఇరాన్ ఆరోపిస్తోంది. దీనికి ప్రతీకారంగానే అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలపై దాడులు చేస్తున్నట్లు ఇరాన్ విప్లవ గార్డ్స్ ప్రకటించాయి.