Dhurandhar: ఆ చిత్రాల రికార్డును బద్దలుకొట్టిన 'ధురంధర్'
ధురంధర్-2 చిత్రం వసూళ్లలో దూసుకుపోతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ.1,128 కోట్లు గ్రాస్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. సినిమా విడుదలైన పదిరోజుల్లోనే ఈ స్థాయిలో కలెక్షన్లు వసూలు చేయడం గమనార్హం. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 18,456 షోలు పడ్డాయి. ధురందర్, ధురందర్-2 రెండు సినిమాలు కలిపి దంగల్, బాహుబలి, పుష్ప చిత్రాల జీవితకాల కలెక్షన్లను దాటాయి.
ధురంధర్-2 తొమ్మిదో రోజు హిందీలో రూ.41.55 కోట్లు, తెలుగులో రూ.2.85 కోట్ల వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో బాహుబలి-2, పుష్ప-2 చిత్రాలతో పోలిస్తే మాత్రం ధురంధర్-2 చాలా వెనుకబడి ఉంది. కానీ చిత్రం విడుదలై పది రోజులు మాత్రమే కావడంతో ఆ చిత్రాలను అధిగమించడానికి అవకాశాలు ఉన్నాయని సినీ పండితులు భావిస్తున్నారు.
బాహుబలి-2 రూ.1,810 కోట్లు, పుష్ప-2 రూ.1,800 కోట్ల వసూళ్లు రాబట్టాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన భారతీయ సినిమా దంగల్. ఈ చిత్రం రూ.2,024 కోట్ల వసూళ్ళు సాధించి రికార్డును అలాగే పదిలపరుచుకుంది. మిగిలిన అన్ని సినిమాలు టిక్కెట్ ధరలను పెంచి విడుదల కాగా, ధురంధర్ మాత్రం టిక్కెట్ ధరలు పెంచకుండానే వసూళ్లను సాధిస్తుండటం గమనార్హం.