RBI: డిజిటల్ చెల్లింపుల్లో ఆర్బీఐ విప్లవాత్మక మార్పులు.. త్వరలో అందుబాటులోకి 'ఈ-చెక్కులు'
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ముందడుగు వేసింది. ‘పేమెంట్స్ విజన్ 2028’ పేరుతో శుక్రవారం ఒక కొత్త రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్ చెక్కుల (e-cheques) ప్రవేశం, మోసపూరిత లావాదేవీలపై బ్యాంకుల బాధ్యతను పెంచడం వంటి పలు సంస్కరణలను ప్రతిపాదించింది.
వినియోగదారుల భద్రతకు పెద్దపీట వేస్తూ ఆర్బీఐ కీలక సూచనలు చేసింది. ప్రస్తుతం డెబిట్, క్రెడిట్ కార్డులకు మాత్రమే ఉన్న ఎనేబుల్/డిసేబుల్ (Enable/Disable) సదుపాయాన్ని ఇకపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులకు వర్తింపజేయాలని ప్రతిపాదించింది. దీనివల్ల ఖాతాదారులు తమ లావాదేవీలపై పూర్తి నియంత్రణ కలిగి ఉండవచ్చు. అంతేకాకుండా, అనధికారిక లావాదేవీలు జరిగినప్పుడు, డబ్బు పంపిన బ్యాంకుతో పాటు స్వీకరించిన బ్యాంకు కూడా ఉమ్మడి బాధ్యత వహించేలా ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని యోచిస్తోంది.
కొత్త వ్యాపార అవసరాలకు అనుగుణంగా కాగితపు చెక్కుల ప్రయోజనాలను, డిజిటల్ వేగాన్ని కలిపి ‘ఈ-చెక్కుల’ను ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ తన నివేదికలో పేర్కొంది. దీంతోపాటు, చెల్లింపుల వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ఈ-కామర్స్ మార్కెట్ ప్లేస్‌లు, ఇతర సెంట్రలైజ్డ్ ప్లాట్‌ఫామ్‌లను కూడా తమ ప్రత్యక్ష నియంత్రణ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తోంది.
వీటితో పాటు చెక్కుల భద్రతా ఫీచర్లను సమీక్షించడం, లావాదేవీలను సులభంగా ట్రేస్ చేసేందుకు కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయడం, విదేశీ చెల్లింపులను వేగవంతం చేయడం వంటి అంశాలను కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో పొందుపరిచారు. ఈ మార్పుల ద్వారా దేశీయ చెల్లింపుల వ్యవస్థను మరింత వేగవంతంగా, సురక్షితంగా, విశ్వసనీయంగా మార్చడమే లక్ష్యమని ఆర్బీఐ స్పష్టం చేసింది.