Raasi: ప్రభాస్ సినిమాలో రోల్.. విమర్శలపై స్పష్టత ఇచ్చిన నటి రాశి

Raasi Clarifies Remarks on Prabhas Movie Role Amid Criticism
షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్ సినిమాలో నటించడంపై తాను చేసిన వ్యాఖ్యల గురించి సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలపై సీనియర్ నటి రాశి స్పందించారు. ప్రభాస్‌కు తల్లి పాత్రలో తప్ప మరే ఇతర పాత్రలోనైనా నటించడానికి సిద్ధమేనని, సోదరి పాత్ర చేయనని తాను చెప్పలేదని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘అనుమాన పక్షి’ సినిమా ఈవెంట్‌లో ఆమె ఈ విషయంపై మాట్లాడారు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో ప్రభాస్ అంటే ఇష్టమని, కానీ ఆయనకు తల్లిగా మాత్రం నటించనని రాశి చెప్పిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు రకరకాలుగా స్పందించడంతో ఆమె ఈ వివరణ ఇచ్చారు. ప్రభాస్ సినిమాలకు గతంలో డబ్బింగ్ చెప్పినా, ఆయన్ను కలవలేకపోయానని కూడా ఆమె గతంలో పేర్కొన్నారు.

‘డీజే టిల్లు’ ఫేమ్ విమల్ కృష్ణ దర్శకత్వంలో రాగ్ మయూర్ హీరోగా ‘అనుమాన పక్షి’ తెరకెక్కింది. ఈ చిత్రంలో తన పాత్ర గురించి వినగానే ఎలాంటి సందేహం లేకుండా ఒప్పుకున్నానని రాశి తెలిపారు. హీరోయిన్‌గా 148 సినిమాలు చేశానని, ఆ అనుభవంతో ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది ధీమాగా చెబుతున్నానన్నారు.  
Go Back to Shorts
Raasi
Prabhas
Anumanam Pakshi
DJ Tillu
Vimal Krishna
Telugu Cinema
Tollywood
Movie Role
Actress Raasi
Rag Mayur

More Telugu News