Advertisement

ఇరాన్‌తో యుద్ధం వేళ కీలక పరిణామం.. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ ఈ-మెయిల్ హ్యాక్

Kash Patel FBI Director Email Hacked Amid Iran Tensions
  • హ్యాక్ చేసినట్లు ప్రకటించుకున్న హండాలా టీమ్
  • కాష్ పటేల్‌కు చెందిన ఫొటోలు, ఫైళ్లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసిన హండాలా
  • హండాలా టీమ్‌కు ఇరాన్‌తో సంబంధాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ వ్యక్తిగత ఈ-మెయిల్‌ను హ్యాక్ చేసినట్లు హ్యాకర్ల బృందం హండాలా టీమ్ ప్రకటించుకుంది. కాష్ పటేల్‌కు చెందిన ఫొటోలు, పలు ఫైళ్లను ఇంటర్నెట్‌లో పోస్టు చేసింది. హ్యాకింగ్‌కు గురైన బాధితుల జాబితాలో, ఇకమీదట కాష్ పటేల్ పేరు కూడా ఉంటుందని పేర్కొంది. ఈ సైబర్ నేరగాళ్లకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఎఫ్‌బీఐ డైరెక్టర్ ఈ-మెయిల్ హ్యాక్ అయిన విషయాన్ని అమెరికా న్యాయశాఖకు అధికారి ఒకరు ధృవీకరించారు. దీనిపై ఎఫ్‌బీఐ అధికారికంగా స్పందించవలసి ఉంది. హండాలా టీమ్‌కు పాలస్తీనా అనుకూల హ్యాకర్లుగా పేరు ఉంది. ఈ హండాలా బృందాన్ని ఇరాన్ ప్రభుత్వ సైబర్ నిఘా విభాగం ఉపయోగించుకుంటోందనే వాదనలు ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మిచిగాన్‌కు చెందిన సంస్థను హ్యాక్ చేసినట్లు కూడా హండాలా టీమ్ ప్రకటించుకుంది.
Advertisement
Kash Patel
FBI Director
Iran
Hack
Email Hack
Cyber Security
US Justice Department
Handala Team

More Telugu News