Nicolas Maduro: ఇది కిడ్నాప్, నన్ను విడుదల చేయండి.. అమెరికా కోర్టులో మదురో వాదన

Nicolas Maduro Claims Kidnapping at US Court Hearing
షార్ట్స్‌లో చూడండి
అమెరికా సైనిక బలగాలు బలవంతంగా అదుపులోకి తీసుకున్న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో, న్యూయార్క్‌లోని న్యాయస్థానంలో రెండోసారి హాజరయ్యారు. ఈ ఏడాది జనవరి ఆరంభంలో కరాకస్‌లోని ఆయన నివాసంపై అమెరికా సైన్యం దాడి చేసి, ఆయనను బంధించిన విషయం తెలిసిందే.

జనవరి 5న జరిగిన తొలి విచారణలో తనపై మోపిన డ్రగ్ ట్రాఫికింగ్ సహా అన్ని అభియోగాలను మదురో తోసిపుచ్చారు. తనను కరాకస్ నుంచి కిడ్నాప్ చేశారని, తాను ఇప్పటికీ వెనిజులా అధ్యక్షుడినేనని ఆయన కోర్టుకు తెలిపారు. తాజాగా గురువారం జరిగిన విచారణలో మదురో తరపు న్యాయవాది కేసును కొట్టివేయాలని గట్టిగా వాదించారు. మదురో న్యాయపరమైన ఖర్చులకు వెనిజులా ప్రభుత్వ నిధులను అమెరికా అడ్డుకోవడం ఆయన రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. అయితే, న్యాయమూర్తి కేసును కొట్టివేయడానికి నిరాకరించారు.

జనవరి 3న అమెరికా సైన్యం వెనిజులాపై భారీస్థాయిలో దాడి చేసి మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌లను బలవంతంగా బంధించి న్యూయార్క్‌కు తరలించింది. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం వారిద్దరినీ న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు.

మరోవైపు, కోర్టు వెలుపల నిరసనకారులు పెద్దఎత్తున గుమికూడి మదురోను వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. "ఎన్నికైన ఒక దేశాధినేతను కిడ్నాప్ చేసే హక్కు అమెరికాకు లేదు" అంటూ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
Nicolas Maduro
Venezuela
US military
kidnapping
drug trafficking
court hearing
political unrest
Caracas
Cilia Flores
extradition

More Telugu News