Ram Charan: 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ కంటికి గాయం.. సర్జరీ చేసిన డాక్టర్ గురించి చిరంజీవి భావోద్వేగ ట్వీట్

Ram Charan Eye Injury Update Chiranjeevi Praises Doctor
షార్ట్స్‌లో చూడండి

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో ఒక యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా స్టార్ హీరో రామ్ చరణ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన కనురెప్ప పైభాగంలో గాయమైంది. వెంటనే స్పందించిన చిత్ర బృందం ఆయన్ని ఆస్పత్రికి తరలించింది. చరణ్‌కు ప్రముఖ వైద్యులు డాక్టర్ సుధాకర్ ప్రసాద్ చిన్నపాటి శస్త్రచికిత్స నిర్వహించారు.


ఈ సర్జరీ విజయవంతంగా పూర్తి కావడంతో చిరంజీవి ఎక్స్ వేదికగా డాక్టర్‌ సుధాకర్ ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు. "డాక్టర్ సుధాకర్ గారు, చరణ్ కనురెప్పపై మీరు సకాలంలో చేసిన నైపుణ్యం కలిగిన సర్జరీ మాకు ఒక ఆశీర్వాదం. మా ఆందోళనను మీ అనుభవం, అంకితభావంతో పూర్తిగా పోగొట్టారు. మీ పనితనం చాలా గొప్పది, అందుకు మేమందరం కృతజ్ఞులం" అంటూ చిరంజీవి పోస్ట్ చేశారు.


మరోవైపు, గాయం కంటి లోపల కాకుండా, కనురెప్ప పైన మాత్రమే కావడంతో చూపుకు ఎలాంటి ఇబ్బంది లేదని వైద్యులు స్పష్టం చేశారు. వైద్యుల సూచన మేరకు చరణ్ రెండు రోజులు విశ్రాంతి తీసుకున్నారు. ఈ చిన్న విరామం తర్వాత ఆయన మళ్ళీ ఈరోజు సెట్స్‌లోకి అడుగుపెడుతున్నారు. ఏప్రిల్ 30న సినిమా విడుదలకు ఎలాంటి ఆటంకం ఉండదని నిర్మాతలు ధీమా వ్యక్తం చేశారు.

Go Back to Shorts
Ram Charan
Peddi Movie
Ram Charan injury
Buchi Babu Sana
Dr Sudhakar Prasad
Chiranjeevi
Ram Charan surgery
Telugu cinema
action sequence
eye injury

More Telugu News