Ram Charan: రామ్‌చరణ్ రేపటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటారు: 'పెద్ది' సినిమా టీమ్

Ram Charan to Join Peddi Movie Shooting Tomorrow
షార్ట్స్‌లో చూడండి
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ గాయపడిన ఘటనపై 'పెద్ది' సినిమా టీమ్ స్పందించింది. ప్రస్తుతం రామ్‌చరణ్ కోలుకుంటున్నారని తెలిపింది. చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో సెట్స్‌లో ఆయన కుడి కంటికి స్వల్పగాయమైనట్లు తెలిపింది. ఈ గాయానికి గాను చికిత్స తీసుకున్నట్లు వెల్లడించింది.

రామ్‌చరణ్‌కు అయిన గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని అభిమానులకు సూచించింది. ఈ గాయంపై ఎలాంటి అనవసర ప్రచారాలను నమ్మవద్దని కోరింది. ఈ గాయం నుంచి కోలుకుంటున్న రామ్‌చరణ్ రేపు చిత్రీకరణలో పాల్గొంటారని వెల్లడించింది.

రామ్‌చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుండగా స్వల్పగాయమైంది. గాయమైనచోట నాలుగు కుట్లు పడినట్లుగా తెలుస్తోంది. కాగా, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయాలని భావిస్తున్నారు.
Go Back to Shorts
Ram Charan
Peddi Movie
Ram Charan Injury
Buchi Babu Sana
Telugu Cinema
Hyderabad Shooting

More Telugu News