జూనియర్ ఎన్టీఆర్ కోసం మొదట 'లవ్ స్టోరీ'.. కొడాలి నాని ఎంట్రీతో మారిన కథ
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వీవీ వినాయక్ అంటేనే హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు, పవర్ ఫుల్ డైలాగులు గుర్తొస్తాయి. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన 'ఆది' సినిమా వెనుక ఉన్న ఒక కథ గురించి ఆయన తాజాగా వివరించారు. వినాయక్ తన కెరీర్ ఆరంభంలో తారక్ కోసం ఒక క్యూట్ లవ్ స్టోరీని సిద్ధం చేశారట. అప్పట్లో తారక్ ఇమేజ్‌ను బట్టి ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ తీస్తే బాగుంటుందని ఆయన భావించారట.
వినాయక్ తారక్‌కు కథ చెబుతున్న సమయంలో అక్కడికి వచ్చిన కొడాలి నాని జోక్యం చేసుకుని.. "మా హీరోతో లవ్ స్టోరీ వద్దు. మాస్ జనాన్ని ఊపేసే ఒక పక్కా కమర్షియల్ సినిమా తీయండి" అని సూచించారట. ఆ మాట వినాయక్ ఆలోచనా దృక్పథాన్ని మార్చేసింది. వెంటనే లవ్ స్టోరీని పక్కన పెట్టి, రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో 'ఆది' కథను సిద్ధం చేశారట.
'ఆది' సినిమాతోనే తారక్ ఒక కంప్లీట్ మాస్ హీరోగా ఎదిగారు. 'అమ్మ తోడు.. అడ్డంగా నరికేస్తా' అనే డైలాగ్ అప్పట్లో ఒక ఊపు ఊపింది. 2002లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వినాయక్ ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది.