పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం: అన్నాడీఎంకే మేనిఫెస్టో విడుదల
తాము అధికారంలోకి వస్తే పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచితంగా ఫ్రిజ్ ఇస్తామని అన్నాడీఎంకే తమ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో డీఎంకే, టీవీకే పార్టీలు వరుసగా తమ మేనిఫెస్టోలను ప్రకటిస్తున్నాయి. తాజాగా అన్నాడీఎంకే తన ఎన్నికల హామీలను విడుదల చేసింది.
రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఉచితంగా ఫ్రిజ్‌లు ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపింది. 5 లక్షల మంది మహిళా ఉద్యోగులకు రూ.25 వేల రాయితీతో ద్విచక్ర వాహనాలు అందిస్తామని ప్రకటించింది. బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది.
ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం ఇస్తామని తెలిపింది. రేషన్ కార్డు ఉన్న వారికి బియ్యంతో పాటు ఉచితంగా కిలో పప్పు, కిలో మంచినూనె అందజేస్తామని తన మేనిఫెస్టోలో పేర్కొంది. సంవత్సరానికి ఒక కుటుంబానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సామాజిక భద్రతా పెన్షన్ రూ.2 వేలకు పెంపు, జల్లికట్టు యోధుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం వంటి హామీలను కూడా పొందుపరిచింది.