Jeevan Reddy: పార్టీ వీడొద్దు.. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సీనియర్ నేత, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు ఆ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ జగిత్యాలలో జీవన్ రెడ్డితో సమావేశమయ్యారు. పార్టీకి రాజీనామా చేయవద్దని ఈ సందర్భంగా ఆయనను కోరారు.
భేటీ అనంతరం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. జీవన్ రెడ్డికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, ఆయనను పార్టీ వదులుకోలేదని స్పష్టం చేశారు. పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఆయన మనస్తాపానికి గురయ్యారని, తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కోరినట్లు తెలిపారు. రెండు రోజుల క్రితం మంత్రి శ్రీధర్ బాబు కూడా జీవన్ రెడ్డితో భేటీ అయి చర్చలు జరిపారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి, ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీలో 'వలస' ఎమ్మెల్యేల జోక్యం పెరిగిపోవడమే తన నిర్ణయానికి కారణమని ఆయన పేర్కొన్నారు. "ఆత్మగౌరవం కంటే ఏదీ ముఖ్యం కాదు. అది లోపించిన చోట రాజకీయాల్లో కొనసాగడంలో అర్థం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే ఎం. సంజయ్ కుమార్ తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీ అధికారంలోకి రావడం కోసం కష్టపడిన నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆయన ఆరోపించారు. భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకునేందుకు రేపు జగిత్యాలలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు బహిరంగ లేఖలో తెలిపారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున గెలిచి, తర్వాత కాంగ్రెస్‌కు దగ్గరైన 10 మంది ఎమ్మెల్యేలలో సంజయ్ కుమార్ ఒకరు. ఇటీవల మున్సిపల్ ఎన్నికల టికెట్ల కేటాయింపులో సంజయ్ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వడంతో ఈ విభేదాలు మరింత ముదిరాయి.