Swiggy: జొమాటో బాటలో స్విగ్గీ.. ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు

Swiggy Hikes Platform Fee Following Zomato
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో బాటలోనే స్విగ్గీ కూడా పయనించింది. తన ప్లాట్‌ఫామ్ ఫీజును పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో ఆర్డర్‌పై వసూలు చేసే ఈ రుసుమును రూ. 14.99 నుంచి రూ. 17.58కి పెంచింది. అంటే జీఎస్టీతో కలిపి దాదాపు 17 శాతం మేర ఛార్జీలు పెరిగాయి. పెరిగిన ఈ ఛార్జీలు స్విగ్గీ యాప్‌లో వినియోగదారులకు ఇప్పటికే కనిపిస్తున్నాయి.

కొన్ని రోజుల క్రితమే జొమాటో కూడా తన ప్లాట్‌ఫామ్ ఫీజును 19 శాతం పెంచిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో ఆర్డర్‌పై రూ. 2 అదనపు భారం పడింది. తాజా పెంపుతో స్విగ్గీ, జొమాటో రెండు యాప్‌లలోనూ ప్లాట్‌ఫామ్ ఫీజు జీఎస్టీతో కలిపి దాదాపు రూ. 17.58కి చేరింది. "ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించడానికి, మెరుగైన సేవలు అందించడానికి" ఈ పెంపు దోహదపడుతుందని స్విగ్గీ తమ వినియోగదారులకు తెలియజేసింది.

నిర్వహణ ఖర్చులు పెరగడమే ఈ పెంపునకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఎల్‌పీజీ, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడంతో రెస్టారెంట్లు, డెలివరీ భాగస్వాములపై ఖర్చుల భారం ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ డెలివరీ సంస్థలు తమ మార్జిన్లను కాపాడుకోవడానికి ప్లాట్‌ఫామ్ ఫీజులను సవరిస్తున్నాయి. జొమాటో 2023 ఆగస్టులో రూ. 2తో ఈ ఫీజును ప్రారంభించి, దశలవారీగా పెంచుకుంటూ వచ్చింది.

కాగా, మంగళవారం ట్రేడింగ్‌లో స్విగ్గీ షేర్లు 0.33 శాతం లాభంతో రూ. 273.40 వద్ద ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్నాయి. గత నెలలో ఈ స్టాక్ 10 శాతానికి పైగా నష్టపోయింది. మరోవైపు ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు తర్వాత జొమాటో షేర్లు 2 శాతం మేర లాభపడటం గమనార్హం.
Go Back to Shorts
Swiggy
Swiggy platform fee hike
Zomato
food delivery apps
online food order
platform fee increase
restaurant costs
LPG prices
crude oil prices
Swiggy share price

More Telugu News