ఇరాన్ పై దాడులు ఆపేదిలేదంటూ నెతన్యాహు కీలక ప్రకటన
ఇరాన్ పై దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సుదీర్ఘ ఫోన్ కాల్ సంభాషణ తర్వాత నెతన్యాహు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ క్షిపణి, అణు కార్యక్రమాలను పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నామని, అలాగే హిజ్బుల్లాపై బలమైన దాడులు కొనసాగిస్తున్నామని వివరించారు. ఇరాన్ తో చర్చలు సానుకూలంగా కొనసాగుతున్న క్రమంలో ఆ దేశంపై 5 రోజుల పాటు దాడులు జరపబోమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, అమెరికా దాడులు ఆపినప్పటికీ తాము మాత్రం ఆపబోమని ఎక్స్ వేదికగా నెతన్యాహు స్పష్టం చేశారు.
ఫోన్లో సుదీర్ఘ చర్చలు
ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి దాడులను ఎదుర్కోవడం, లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడుల వ్యూహంపై ట్రంప్, నెతన్యాహు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, ‘శాంతి ఒప్పందం’ దిశగా కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపినట్లు సమాచారం. లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించి, బందీల విడుదలకు మార్గం సుగమం చేసే ప్రణాళికపై దృష్టి సారించినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా పూర్తి మద్దతు కొనసాగుతుందని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు.
ఈ చర్చల్లో కేవలం సైనిక, దౌత్యపరమైన అంశాలే కాకుండా ఇరాన్ సాగిస్తున్న ‘సమాచార యుద్ధం’ కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ విడుదల చేస్తున్న ఏఐ వీడియోలు, మీమ్స్‌పై కఠినంగా వ్యవహరించాలని అమెరికా నిర్ణయించినట్లు సమాచారం. కాగా, ఒకవైపు శాంతి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, మరోవైపు ఇరాన్ తన వైఖరి మార్చుకోకపోవడం, ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగించడం వంటి పరిణామాలతో పశ్చిమాసియాలో ఉత్కంఠ కొనసాగుతోంది.