ఆర్డీటీ సేవలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు ఇకపై నిరంతరాయంగా కొనసాగనున్నాయి. ఈ సంస్థకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) కింద లైసెన్స్ రెన్యువల్ పూర్తయినట్లు రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దీంతో ఆర్డీటీకి విదేశీ విరాళాల స్వీకరణకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
ఆర్డీటీ సేవలు నిలిచిపోవని గతంలోనే మాట ఇచ్చానని, ఆ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణం, నిరుపేద పిల్లల చదువు, ఉపాధి, వైద్యం వంటి రంగాల్లో ఆర్డీటీ చేస్తున్న కృషిని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు వివరించినట్లు తెలిపారు. తమ విజ్ఞప్తి మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించిందని, దీంతో ఆర్డీటీ రెన్యువల్ ప్రక్రియ పూర్తయిందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ప్రభుత్వ అధికారులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే దశాబ్దాలుగా సేవా స్ఫూర్తితో పనిచేస్తున్న ఆర్డీటీ నిర్వాహకులు మాంచో ఫెర్రర్‌కు అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ప్రజలకు మేలు జరుగుతుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.