ట్రంప్ ప్రకటనకు ముందే ట్రేడింగ్.. అమెరికాలో ఇన్‌సైడర్ కుంభకోణం?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు వాల్‌స్ట్రీట్‌లో పెను దుమారం రేపుతోంది. ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడానికి కొన్ని నిమిషాల ముందే స్టాక్ మార్కెట్‌లో భారీగా లావాదేవీలు జరగడం ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అత్యంత రహస్యంగా ఉండాల్సిన సమాచారం ముందే లీక్ అవ్వడం వల్లే కొందరు ఇన్వెస్టర్లు వందల కోట్ల లాభాలు గడించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
సోమవారం సాయంత్రం ట్రంప్ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించకముందే, ‘ఎస్&పీ 500’ ఫ్యూచర్స్‌లో కొందరు ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. ఆ తర్వాత ట్రంప్ ప్రకటన వెలువడగానే యుద్ధ భయాలు తొలగి మార్కెట్లు ఒక్కసారిగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. దీంతో ముందుగా పెట్టుబడులు పెట్టిన వారు భారీ లాభాలను ఆర్జించారు. కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువైన అనుమానాస్పద ట్రేడింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
ఈ అత్యంత కీలక సమాచారం వైట్‌హౌస్ లేదా రక్షణ శాఖ నుంచి లీక్ అయి ఉండవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. యుద్ధం, శాంతి వంటి సున్నితమైన అంశాలను అడ్డం పెట్టుకుని కొందరు అక్రమంగా లాభాలు పొందడంపై ఆర్థిక నిపుణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) వెంటనే సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు కొన్ని హెడ్జ్ ఫండ్స్ ఖాతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.