"ట్రంప్ వెనక్కి తగ్గారు": యుద్ధానికి విరామంపై ఇరాన్ మీడియా ఏమన్నదంటే?
ఇరాన్‌పై దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. చర్చలు జరిపారన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ అధికారిక మీడియా కొట్టిపారేసింది. అలాగే ఆ దేశంలోని వివిధ మీడియా సంస్థలు కూడా స్పందించాయి. అమెరికాను, ముఖ్యంగా ట్రంప్ లక్ష్యంగా విమర్శలు చేశాయి. యుద్ధాన్ని ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నామని ట్రంప్ చెప్పడాన్ని, ఇరాన్ విజయంగా అభివర్ణించాయి.
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ మీడియా ప్రెస్ టీవీ ఖండించింది. అమెరికాతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎలాంటి చర్చలు లేదా సంప్రదింపులు జరగలేదని స్పష్టం చేసింది. అమెరికా హెచ్చరికలకు ఇరాన్ దీటుగా స్పందించడం, అలాగే తన సొంత దేశం అమెరికాలో, గల్ఫ్ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా ట్రంప్ చర్చల పేరుతో ప్రకటన చేశారని ఒక సీనియర్ భద్రతాధికారి చెప్పినట్లు ప్రెస్ టీవీ పేర్కొంది. ట్రంప్ ప్రకటన నేపథ్యంలో, ఇప్పటికిప్పుడు హర్మూజ్ జలసంధిని పునరుద్ధరించడం లేదని సదరు అధికారి చెప్పారని తెలిపింది.
ఇంధన కేంద్రాలపై ఇటీవల జరిగిన దాడులు, టెహ్రాన్ ప్రతిస్పందన వాషింగ్టన్‌ను యుద్ధం విషయంలో పునరాలోచించేలా చేశాయని మెహర్ న్యూస్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. అయినప్పటికీ ట్రంప్ ఐదు రోజుల వాయిదా ఒక బూటకమని అభిప్రాయపడింది.
దౌత్యం పేరుతో ట్రంప్ వేసిన వెనుకంజగా టెహ్రాన్ టైమ్స్ పేర్కొంది. ఇరాన్ సైన్యం హెచ్చరికల నేపథ్యంలోనే ట్రంప్ వెనక్కి తగ్గారని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఐఆర్ఐబీ తెలిపింది. టెహ్రాన్ దీటుగా స్పందించి అమెరికా మౌలిక సదుపాయాలను దెబ్బతీసిందని, అందువల్లే ట్రంప్ ఐదు రోజుల విరామం ప్రకటించారని అభిప్రాయపడింది.
ట్రంప్ మళ్లీ వెనక్కి తగ్గారని, అమెరికా సైతానుకు మరో ఓటమి తప్పదని ఇరాన్ జాతీయ భద్రత, విదేశాంగ విధాన కమిషన్ ప్రతినిధి ఇబ్రహీమ్ రెజాయీ పేర్కొన్నారు. ఇరాన్ దీటుగా స్పందించడం వల్లే అమెరికా, ట్రంప్ వెనక్కి తగ్గినట్లు ఆ దేశ మీడియా అభిప్రాయపడింది.