హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకలపై టోల్ ఛార్జీ... స్పందించిన భారత్‌లోని ఇరాన్ ఎంబసీ
హర్మూజ్ జలసంధి మీదుగా వెళ్లే నౌకల నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున టోల్ ఫీజు విధించనున్నట్లు వస్తున్న వార్తలపై భారతదేశంలోని ఇరాన్ ఎంబసీ స్పందించింది. ఈ ప్రచారాన్ని ఇరాన్ దౌత్య కార్యాలయం ఖండించింది. ఫీజులకు సంబంధించి తమ అధికారులు ఎవరూ ఎటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేసింది. కొందరు వ్యక్తులు చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఇరాన్‌కు ఆపాదించారని తెలిపింది.
ఈ మేరకు భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం 'ఎక్స్' వేదికగా పోస్టు చేసింది. కొంతమంది చెప్పిన వ్యక్తిగత అభిప్రాయాలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి నిరాధారమైన వార్తలను ఎవరూ విశ్వసించవద్దని పేర్కొంది. వ్యక్తిగత అభిప్రాయాలతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్‌కు సంబంధం లేదని తెలిపింది.
హర్మూజ్ మీదుగా వెళ్లే నౌకల నుంచి 2 మిలియన్ డాలర్ల చొప్పున టోల్ ఫీజు వసూలు చేయనున్నట్లు ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్దిని ప్రకటించారని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. యుద్ధం కారణంగా ఖర్చులు పెరగడంతో ఈ ఛార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని తెలిపింది.