అదే జరిగితే సీమైన్స్ పెడతాం: అమెరికాకు ఇరాన్ గట్టి వార్నింగ్

అమెరికాకు ఇరాన్ మరోసారి గట్టి వార్నింగ్ ఇచ్చింది. అగ్రరాజ్యం భూతల దాడులకు దిగే అవకాశముందని, ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనంలోకి తీసుకోచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ప్రచారంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇరాన్ తీరం లేదా ద్వీపాలపై దాడి చేస్తే పర్షియన్ గల్ఫ్ అంతటా సీమైన్స్ పరుస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. దీనితో గల్ఫ్ షిప్పింగ్ మార్గాలు, కమ్యూనికేషన్ లైన్లకు తీవ్ర అంతరాయం కలగవచ్చని రాయిటర్స్ కథనం పేర్కొంది.

తమ తీరం నుంచే పర్షియన్ గల్ఫ్ ప్రాంత జలాల్లోకి సీమైన్స్ ప్రవేశపెట్టగలమని ఇరాన్ హెచ్చరించింది. దీనితో సుదీర్ఘకాలం గల్ఫ్ ప్రాంతమంతటా హర్మూజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితి ఉంటుందని పేర్కొంది. 1980లలో స్వల్ప సంఖ్యలో పరిచిన సీమైన్స్‌ను తొలగించడానికి 100 మైన్ స్వీపర్లు ప్రయత్నించి విఫలమైన విషయం మరిచిపోకూడదని ఇరాన్ గుర్తు చేసింది.

ఇరాన్ చమురు ఎగుమతులకు ఖర్గ్ ప్రాంతం ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో ఖర్గ్‌ను ఆక్రమిస్తే ఇరాన్‌పై ఒత్తిడి తేవచ్చని అమెరికా భావిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే 4,500 మంది సెయిలర్లు, మెరైన్లను అమెరికా మోహరించింది. హెలికాప్టర్లు, ఎఫ్-35 ఫైటర్ జెట్స్, సాయుధ ల్యాండింగ్ వెహికిల్స్‌తో కూడిన బెటాలియన్‌ను కూడా పంపించింది.


More Telugu News