ప్రభుత్వ అధినేతగా మోదీ రికార్డ్.. అభినందించిన చంద్రబాబు, పవన్, జగన్
భారతదేశంలో ప్రభుత్వ అధినేతగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆయనకు అభినందనలు తెలిపారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఆదివారమే ప్రధానిని అభినందించిన విషయం తెలిసిందే.
ఈ అసాధారణ మైలురాయిపై పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా మొత్తం 8,931 రోజులు నిరంతరాయంగా ప్రభుత్వ అధినేతగా సేవలు అందించడంపై ప్రధానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. "ఆయన ప్రస్థానం కేవలం పదవీకాలానికి సంబంధించింది కాదు. ఇది తిరుగులేని సంకల్పం, అలుపెరగని అంకితభావం, భారత సేవకే అంకితమైన జీవితం. అట్టడుగు స్థాయి నాయకత్వం నుంచి ప్రపంచ వేదికపై దేశానికి మార్గనిర్దేశం చేసే వరకు, 'దేశమే ప్రథమం' అనే స్పష్టమైన దార్శనికతతో ఆయన పాలనను పునర్నిర్వచించారు" అని పవన్ కల్యాణ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
రెండు దశాబ్దాలకు పైగా ఆయన నాయకత్వం క్రమశిక్షణ, త్యాగం, అసమానమైన పనితీరుకు నిదర్శనమని, దేశ మౌలిక సదుపాయాల బలోపేతం, పేదల సాధికారత, డిజిటల్ విప్లవం, ప్రపంచ వేదికపై భారత్ ప్రతిష్ఠను పెంచడం వంటి అంశాలు లక్షలాది మందికి స్ఫూర్తినిస్తాయని కొనియాడారు.
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. "ప్రభుత్వ అధినేతగా 8,931 రోజులు పూర్తి చేసుకుని, ప్రజాసేవలో చారిత్రక మైలురాయిని నెలకొల్పిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఈ ఘనత ఒక వ్యక్తి సంకల్పానికి, దృఢచిత్తానికి నిదర్శనం. దేశ సేవలో మీకు మరింత శక్తి, ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నాను" అని జగన్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అంతకుముందు సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రధానిని అభినందించారు. దేశ పురోగతి, శ్రేయస్సు కోసం ప్రధాని మోదీ అంకితభావం, దార్శనిక నాయకత్వానికి ఈ ఘనత ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు. కాగా, సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును ప్రధాని మోదీ అధిగమించి, భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వ అధినేతగా పనిచేసిన నేతగా నిలిచారు.