Gold Price: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న బంగారం, వెండి ధరలు ఇవాళ ఊహించని రీతిలో కుప్పకూలాయి. అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల ప్రభావం దేశీయ బులియన్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్‌లో ధరలు భారీగా తగ్గడంతో జ్యువెలరీ షాపుల వద్ద సందడి మొదలైంది.
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) నిన్నటితో పోలిస్తే ఏకంగా రూ. 5,950 తగ్గి, ప్రస్తుతం రూ. 1,40,020 వద్ద ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 5,450 పతనమై రూ. 1,28,350 కు చేరింది. కిలో వెండి ధర ఏకంగా రూ. 20,000 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రూ. 2,30,000 పలుకుతోంది.