Rohit Sharma: హిట్‌మ్యాన్ బయోపిక్.. హీరో శర్వానంద్ ఏమన్నారంటే..!
భారతీయ చిత్ర పరిశ్రమలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా క్రీడాకారుల జీవిత కథలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ బయోపిక్‌లో రోహిత్ పాత్రలో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ నటించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తాజాగా ఈ ఊహాగానాలపై శర్వానంద్ స్వయంగా స్పందించడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి మరింత పెరిగింది.
తాజాగా తన కొత్త సినిమా ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వానంద్‌ను ఈ విషయంపై ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. "రోహిత్ శర్మ బయోపిక్ గురించి నాకు అధికారికంగా ఏమీ తెలియదు. కానీ, నా పేరు వినిపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. రోహిత్ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమైంది. ఒకవేళ ఆ కథ నా దగ్గరకు వస్తే తప్పకుండా ఆలోచిస్తాను" అని శర్వానంద్ తెలిపారు. ఆయన రోహిత్ పాత్రకు సరిగ్గా సరిపోతారని, ఫిజిక్, లుక్ పరంగా దగ్గరగా ఉంటారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి, భారత జట్టుకు కెప్టెన్‌గా ఎదిగిన రోహిత్ ప్రయాణం ఎందరికో ఆదర్శం. ఓపెనర్‌గా, కెప్టెన్‌గా జట్టుకు ఎన్నో మరపురాని విజయాలు అందించాడు. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు, అత్యధిక వ్యక్తిగత స్కోరు (264), అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు వంటి అరుదైన రికార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. మూడు ఫార్మాట్లలో కలిపి 20 వేల పరుగుల మైలురాయిని దాటిన దిగ్గజాల జాబితాలోనూ చోటు సంపాదించాడు.
ఇప్పటికే ఎంఎస్ ధోనీ, సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ వంటి దిగ్గజ క్రికెటర్ల బయోపిక్‌లు విజయం సాధించాయి. త్వరలో సౌరవ్ గంగూలీ బయోపిక్ కూడా రానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ బయోపిక్‌పై అంచనాలు నెలకొన్నాయి. ఇదే ఈవెంట్‌లో పాల్గొన్న సీనియర్ నటుడు రాజశేఖర్ సరదాగా కలుగజేసుకుంటూ, ‘శర్వానంద్ రోహిత్ శర్మ అయితే, నేను ధోనీ అవుతా’ అని వ్యాఖ్యానించి నవ్వులు పూయించారు. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన రానప్పటికీ, శర్వానంద్ వ్యాఖ్యలతో ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కవచ్చని అభిమానులు ఆశిస్తున్నారు.