వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

మెగా డాటర్, నిర్మాత నిహారిక కొణిదెల తన అన్నయ్య, నటుడు వరుణ్ తేజ్ ప్రేమ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల ప్రేమ గురించి తనకు నాలుగేళ్ల తర్వాత తెలిసిందని, ఓ పార్టీలో వారిద్దరినీ చూసి అనుమానం వచ్చిందని ఆమె వెల్లడించారు. తాను నిర్మాతగా వ్యవహరించిన ‘రాకాస’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు పంచుకున్నారు.

నిహారిక మాట్లాడుతూ..'అందరూ మా అన్నయ్యను ఇంట్రావర్ట్‌ అనుకుంటారు, కానీ కాదు. వాడు పెద్ద రౌడీ, నన్ను బాగా ఏడిపిస్తాడు. ఇండస్ట్రీలో అతనికి స్నేహితులు తక్కువ కావడంతో, లావణ్యతో ప్రేమ విషయం చాలా కాలం రహస్యంగా ఉంది. ఓసారి అన్నయ్య బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు లావణ్య వచ్చింది. మా అన్నయ్య ఎవరినీ పార్టీలకు పిలవడు. అందుకే అప్పుడే వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని నాకు అర్థమైంది' అని నవ్వుతూ చెప్పారు.

ఇదే సందర్భంగా, 'మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటారా?' అన్న ప్రశ్నకు నిహారిక స్పందిస్తూ, తప్పకుండా చేసుకుంటానని, అయితే ప్రస్తుతం దానిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదని స్పష్టం చేశారు.
 


More Telugu News