మరొక యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్... దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ
- శెట్టిబలిజ జాతిపితకు సముచిత గౌరవం
- యువగళం హామీకి కార్యరూపం
- సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటన
- ప్రతి ఏటా మార్చి 23న అధికారికంగా వేడుకలు జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులు
- శెట్టిబలిజ సమాజ అభ్యున్నతికి దొమ్మేటి సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ హామీని అమలు చేస్తామని లోకేశ్ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. దీని ప్రకారం, ప్రతి ఏటా మార్చి 23న అన్ని ప్రభుత్వ శాఖలు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నాయి.
కోనసీమ ప్రాంతానికి చెందిన స్వర్గీయ దొమ్మేటి వెంకటరెడ్డి, శెట్టిబలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మగౌరవం కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప సంస్కర్త. శెట్టిబలిజ సంక్షేమ సంఘాన్ని స్థాపించి, 19వ శతాబ్దం తొలినాళ్లలోనే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన ఎంతగానో పాటుపడ్డారు. విద్య యొక్క ప్రాముఖ్యతను చాటిచెప్పి, సామాజిక చైతన్యానికి బాటలు వేశారు. ఆయన సేవలను గౌరవిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.