ఐపీఎల్ మధ్యలో చార్టర్డ్ ఫ్లయిటా?... ఇన్‌స్టా పోస్టుపై కోహ్లీ రియాక్షన్ ఇదిగో!
టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనపై వస్తున్న కొన్ని వార్తలను నవ్వుతూ కొట్టిపారేశాడు. ఐపీఎల్ 2026 సీజన్ మధ్యలో లండన్ వెళ్లేందుకు తాను చార్టర్డ్ విమానం అడిగినట్లు వచ్చిన ప్రచారాన్ని "ఫేక్ న్యూస్" అని తేల్చేశాడు.
వివరాల్లోకి వెళితే, 'వరల్డ్ఇన్‌లాస్ట్24అవర్స్' అనే ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కోహ్లీ గురించి ఒక పోస్ట్ చేశారు. దాని ప్రకారం, ఐపీఎల్ మ్యాచ్‌ల మధ్య మూడు రోజుల కంటే ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు లండన్ వెళ్లి రావడానికి కోహ్లీ ఆర్‌సీబీ యాజమాన్యాన్ని చార్టర్డ్ ఫ్లయిట్ సౌకర్యం కోరినట్టు అందులో పేర్కొన్నారు. ఈ పోస్ట్ తన దృష్టికి రావడంతో, కోహ్లీ దాని స్క్రీన్‌షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పంచుకున్నాడు. దానికి నవ్వుతున్న ఎమోజీలను జతచేసి, ఆ వార్తల్లో నిజం లేదని పరోక్షంగా స్పష్టం చేశాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే, కోహ్లీ స్పందనతో తమ అకౌంట్ క్రాష్ అయిందంటూ సదరు ఇన్‌స్టాగ్రామ్ పేజీ మరో పోస్ట్ చేసింది.
ఇదిలా ఉండగా, కోహ్లీ ఇటీవలే ఆర్‌సీబీ జట్టుతో కలిసి తొలి ట్రైనింగ్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లను ఉద్దేశించి స్ఫూర్తిదాయకంగా ప్రసంగించాడు. "గతేడాది మనం సాధించిన విజయం కోసం గత రెండు, మూడు సీజన్లుగా చాలా కష్టపడ్డాం. ఈసారి అది మరింత కఠినం కానుంది. ఎందుకంటే మిగతా జట్లు మనపై గట్టిగా పోటీకి వస్తాయి. ఈ రెండున్నర నెలలు ఒక్క నిమిషం కూడా వృథా చేయకుండా 120 శాతం కష్టపడాలి" అని కోహ్లీ తన సహచరులకు పిలుపునిచ్చాడు. హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ కొత్త ఆటగాళ్లకు జట్టులోకి స్వాగతం పలికిన అనంతరం కోహ్లీ ఈ ప్రసంగం చేశాడు.