మోదీకి నేను 'అంధభక్తురాలిని'.. ‘ధురంధర్ 2’ సినిమాపై రేణు దేశాయ్ కామెంట్స్ వైరల్!
నటి రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని ప్రశంసిస్తూ తాను "గర్వపడే అంధభక్తురాలిని" (Proud Andhbhakt) అని ఆమె బహిరంగంగా ప్రకటించారు. తాజాగా 'ధురంధర్ 2' సినిమాను సమీక్షిస్తూ ఆమె పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణ్‌వీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' చిత్రాన్ని వీక్షించిన అనంతరం రేణు దేశాయ్ తన అభిప్రాయాలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ క్రమంలో ఆ సినిమాలోని ఓ సన్నివేశాన్ని ఆమె ప్రత్యేకంగా హైలైట్ చేశారు. ఆ వీడియో క్లిప్‌లో అస్వస్థతతో ఉన్న దావూద్ ఇబ్రహీంను పోలిన ఓ విలన్ పాత్ర, "ఎప్పటి నుంచైతే ఈ చాయ్‌వాలా హిందుస్థాన్‌లో అధికారంలోకి వచ్చాడో, అప్పటి నుంచి మన వాళ్లలో భయం ఇంకా పెరిగిపోయింది" అని అంటుంది. "చాయ్‌వాలా కా జల్వా" అనే క్యాప్షన్‌తో ఉన్న ఈ వీడియోను రీషేర్ చేసిన రేణూ, "బీజేపీకి, మన అద్భుతమైన ప్రధాని మోదీజీకి నేను గర్వపడే అంధభక్తురాలిని" అని రాసుకొచ్చారు.
అంతకుముందు మరో పోస్ట్‌లో మన సైనిక దళాలు, నిఘా ఏజెన్సీల పట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాను తప్పకుండా చూడాలని ఆమె సూచించారు. "వారి వల్లే మనం మన ఇళ్లలో ప్రశాంతంగా జీవిస్తున్నాం" అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అధికారంలో ఉండగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ రాజకీయ నేపథ్యంలో రేణు దేశాయ్ నేరుగా ప్రధాని మోదీకి, బీజేపీకి ఇంత బలంగా మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.