మూడ్రోజుల్లోనే 500 కోట్లు... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'ధురంధర్ 2'
ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్ 2' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల మార్కును దాటి సంచలనం సృష్టించింది. ముఖ్యంగా మూడో రోజైన శనివారం నాడు వసూళ్లు భారీగా పుంజుకోవడంతో ఈ చిత్రం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
భారత్‌లో ఈ సినిమా వసూళ్ల వివరాలు పరిశీలిస్తే... శాక్‌నిల్క్ (Sacnilk) నివేదిక ప్రకారం శనివారం ఒక్కరోజే రూ. 113 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. గురువారం (మొదటి రోజు) రూ. 102.55 కోట్లు, శుక్రవారం (రెండో రోజు) రూ. 80.72 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం, మూడో రోజు భారీ వృద్ధితో మొత్తం మూడు రోజుల దేశీయ నెట్ వసూళ్లను రూ. 296.27 కోట్లకు చేర్చింది.
దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ 'ధురంధర్ 2' తన హవా చూపిస్తోంది. ఓవర్సీస్‌లో సుమారు రూ. 96.50 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో మొత్తం గ్లోబల్ కలెక్షన్లు రూ. 501.04 కోట్లకు చేరాయి. ముఖ్యంగా నార్త్ అమెరికా (యూఎస్ఏ, కెనడా)లో భారతీయ సినిమాల్లో అత్యంత భారీ స్థాయిలో విడుదలైన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ ఏకంగా 4,405 షోలలో ప్రదర్శితమవుతోంది. మూడో రోజు అడ్వాన్స్ సేల్స్ రూపంలోనే 2 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడై రూ. 23.70 కోట్లు వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రస్తుత వసూళ్ల వేగాన్ని బట్టి చూస్తే, ఈ చిత్రం అంతిమంగా రూ. 2000 కోట్ల క్లబ్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. శాక్‌నిల్క్ సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఈ క్లబ్‌లో 'దంగల్' (రూ. 2070 కోట్లు) మాత్రమే ఉంది. ఈ క్రమంలో 'ధురంధర్ 2'... 'జవాన్', 'కేజీఎఫ్ 2', 'బాహుబలి 2', అలాగే సిరీస్‌లోని మొదటి భాగమైన 'ధురంధర్' (రూ. 1307.35 కోట్లు) రికార్డులను అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.