'సర్‌ప్రైజ్' అంటూ ట్రంప్ చమత్కారం.. తీవ్ర అసౌకర్యానికి గురైన జపాన్ ప్రధాని
వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని తకైచి మధ్య చర్చలు... వాతావరణం అంతా ఎంతో ఉల్లాసంగా, స్నేహపూర్వకంగా ఉంది. జపాన్ ప్రధాని ఇంగ్లిష్‌ను అనర్గళంగా మాట్లాడటాన్ని చూసి మురిసిపోయిన ట్రంప్ "ఇక మనకు అనువాదకులతో పనిలేదు" అంటూ జోకులు పేల్చారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో, ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నతో ఒక్కసారిగా సంభాషణ మలుపు తిరిగింది.
ఇరాన్‌పై ఇటీవల జరిపిన మెరుపు దాడుల గురించి మిత్రదేశాలకు ఎందుకు ముందుగా చెప్పలేదని విలేకరి ప్రశ్నించారు. దీనికి ట్రంప్ బదులిస్తూ, శత్రువును ఆశ్చర్యపరచడానికే అలా చేశామన్నారు. అంతటితో ఆగకుండా "అసలు 'సర్ ప్రైజ్' అంటే జపాన్ కంటే బాగా ఎవరికి తెలుసు?" అని అంటూ, పక్కనే ఉన్న ప్రధాని తకైచి వైపు తిరిగి "పెర్ల్ హార్బర్ గురించి నాకెందుకు ముందు చెప్పలేదు?" అని సరదాగా ప్రశ్నించారు. 1941లో అమెరికా నౌకా స్థావరంపై జపాన్ చేసిన ఆకస్మిక దాడిని ఆయన పరోక్షంగా గుర్తుచేశారు.
ట్రంప్ వ్యాఖ్యలతో అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలముకుంది. ఆ మాటలు జపాన్ ప్రధాని తకైచికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగించాయి. ఆమె ముఖంలో అసహనం స్పష్టంగా కనిపించింది. అమెరికా చరిత్రలో పెర్ల్ హార్బర్ దాడి ఒక మాయని గాయం. ఆ ఘటనలో 2,400 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోగా, అదే అమెరికాను రెండో ప్రపంచ యుద్ధంలోకి దించి, హిరోషిమా-నాగసాకి నగరాలపై అణుబాంబులు వేసే పరిస్థితికి దారితీసింది. ఇరాన్‌పై దాడుల వంటి కీలక పరిణామం తర్వాత జరుగుతున్న ఈ సమావేశంలో, ట్రంప్ ఇలా పాత గాయాలను కెలికేలా మాట్లాడటం దౌత్య వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వైట్ హౌస్ రంగంలోకి దిగింది. ట్రంప్‌కు, ప్రధాని తకైచికి మధ్య ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయన అలా సరదాగా అన్నారని, ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదని వివరణ ఇచ్చింది. మరోవైపు జపాన్ కూడా ఈ అంశాన్ని పెద్దది చేయకుండా, ఇరు దేశాల రక్షణ బంధం పటిష్ఠంగానే ఉందని ప్రకటించింది.