ఇన్‌స్టా యూజర్లకు గుడ్‌న్యూస్.. ట్యాప్-టు-పాజ్ ఫీచర్ వచ్చేసింది!
సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్ తమ యూజర్ల కోసం ఓ కీలకమైన, సౌకర్యవంతమైన మార్పును తీసుకొచ్చింది. ఇప్పటివరకు రీల్స్ చూస్తున్నప్పుడు వీడియోను మధ్యలో ఆపాలంటే స్క్రీన్‌పై గట్టిగా నొక్కి పట్టుకోవాల్సి (ప్రెస్ అండ్ హోల్డ్) వచ్చేది. కానీ ఇకపై ఆ శ్రమ అవసరం లేదు. కేవలం ఒక్కసారి స్క్రీన్‌ను టచ్ చేస్తే చాలు, వీడియో అక్కడికక్కడే ఆగిపోతుంది.
ఈ కొత్త 'ట్యాప్-టు-పాజ్' ఫీచర్‌ను అధికారికంగా అందుబాటులోకి తెచ్చినట్లు ఇన్‌స్టాగ్రామ్ హెడ్ ఆడమ్ మోస్సేరి స్వయంగా ప్రకటించారు. దీనివల్ల యూజర్లు వీడియోలోని క్యాప్షన్లను చదవాలన్నా, ఏదైనా అంశాన్ని నిశితంగా గమనించాలన్నా చాలా సులభం అవుతుందని ఆయన తెలిపారు. కంటెంట్‌పై వినియోగదారులకు మరింత నియంత్రణ ఇవ్వడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వీడియో పాజ్ చేసినప్పుడు 'మ్యూట్' ఆప్షన్ కూడా కనిపిస్తుంది. ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లందరికీ ఈ అప్‌డేట్ దశలవారీగా అందుబాటులోకి వస్తోంది.
కేవలం ఈ ఫీచర్‌తోనే సరిపెట్టకుండా, క్రియేటర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్ మరిన్ని ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా పరిచయం చేస్తోంది. 'వాయిస్ ఎఫెక్ట్స్' పేరుతో రోబోట్, ఏలియన్ వంటి ఎనిమిది రకాల ఆడియో ఫిల్టర్లను తీసుకొచ్చింది. దీంతోపాటు, "క్రియేట్ మై లైక్‌నెస్" పేరుతో ఒక ఏఐ ఫేస్ స్వాప్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించింది. దీని ద్వారా యూజర్లు తమ పోలికలతో ఏఐ చిత్రాలు, వీడియోలు సృష్టించుకోవచ్చు.
అయితే, ఇన్‌స్టాగ్రామ్ తీసుకొస్తున్న ఈ ఏఐ ఫేస్ స్వాప్ ఫీచర్‌పై టెక్ నిపుణుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఏఐ కోసం యూజర్ల ముఖ కవళికల డేటాను (లైక్‌నెస్) సేకరించడం వారి గోప్యతకు భంగం కలిగించవచ్చని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన మెటా సంస్థ, యూజర్ల అనుమతితోనే డేటాను వినియోగిస్తామని, భద్రతా ప్రమాణాలకు పెద్దపీట వేస్తామని స్పష్టం చేసింది.