మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు దుబ్బాక సమీపంలో గండి

సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్ ప్రధాన కాలువకు గండిపడింది. దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ గ్రామ సమీపంలో ఈ కాలువకు గండిపడింది. ఈ కాలువ మల్లన్నసాగర్ నుంచి దుబ్బాక ప్రాంతానికి నీరు అందిస్తుంది. కాలువకు గండిపడటంతో నీరు వృథాగా చెల్లాపూర్ కందూరు చెరువులోకి వెళుతోంది. సాగర్‌కు గండి పడటంతో కాలువ కింద పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గండిపడిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు.

అధికారులను కలిసిన రైతులు, కాలువకు త్వరగా మరమ్మతులు చేయాలని లేదంటే పంటలు ఎండిపోతాయని విజ్ఞప్తి చేశారు. కాలువను సాధ్యమైనంత తొందరగా బాగుచేసి నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. మల్లన్న సాగర్ నుంచి వచ్చే కెనాల్ కాలువ లైనింగ్ పనుల్లో క్వాలిటీ లేకపోవడం వల్ల కాల్వకు గండిపడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.


More Telugu News