బెంగళూరులో అడుగుపెట్టిన కోహ్లీ.. 'కింగ్' రాకతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!
ఐపీఎల్ 19వ సీజన్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బెంగళూరు చేరుకున్నాడు. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుతో కలిసి ప్రాక్టీస్ చేసేందుకు నగరానికి విచ్చేశాడు. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో టైటిల్‌ను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ఆర్సీబీ బరిలోకి దిగుతోంది.
కోహ్లీ రాకను తెలియజేస్తూ ఆర్సీబీ తమ సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకుంది. విమానాశ్రయం నుంచి కారులో వస్తున్న కోహ్లీ విజువల్స్‌కు కేజీఎఫ్ థీమ్ మ్యూజిక్‌ను జోడించి ఈ వీడియోను రూపొందించారు. ఇందులో ట్రాఫిక్ సిగ్నల్‌పై కోహ్లీ జెర్సీ నంబర్ 18 కనిపించడం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. "అతను వస్తున్నాడని తెలుసుకోవడానికి మీరు అతన్ని చూడాల్సిన అవసరం లేదు. క్యాలెండర్ చూడండి.. సంకేతాలు కనిపిస్తాయి" అని ఆర్సీబీ క్యాప్షన్ ఇచ్చింది.
కోహ్లీ రాకతో అభిమానులు సోషల్ మీడియాలో పండగ చేసుకుంటున్నారు. మార్చి 18వ తేదీన జెర్సీ నంబర్ 18 ఉన్న 'కింగ్' తన సామ్రాజ్యంలోకి అడుగుపెట్టాడని కామెంట్లు పెడుతున్నారు. గత సీజన్‌లో ఆర్సీబీ తొలిసారి టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 8 అర్ధశతకాలతో 657 పరుగులు చేసి జట్టు విజయంలో పాలుపంచుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా 8,661 పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లో ఉన్నాడు.
కర్ణాటక ప్రభుత్వ అనుమతితో ఆర్సీబీ తమ తొలి మ్యాచ్‌లను సొంతగడ్డ చిన్నస్వామి స్టేడియంలో ఆడనుంది. ఈ నెల 28న జరిగే సీజన్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5న చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ ఆడనుంది.