'ధురంధర్ 2'పై ఆర్జీవీ సంచలన రివ్యూ.. ఆ సినిమాలు ఇక టీవీ సీరియళ్లేనట!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రాబోతున్న 'ధురంధర్ 2' చిత్రంపై ఆయన తన తొలి రివ్యూను ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సినిమా ఒక కొత్త సినీ శకానికి నాంది పలుకుతుందని, దీని దెబ్బకు ఇప్పటివరకు వచ్చిన గొప్ప చిత్రాలన్నీ టీవీ సీరియళ్లలా కనిపిస్తాయని జోస్యం చెప్పారు.
"నిన్న రాత్రి ధురంధర్ 2 చూశాక చెబుతున్నా.. వసూళ్లు, ప్రేక్షకుల స్పందన, సామాజిక ప్రభావం, సినిమా వ్యాకరణం.. ఇలా ఏ రకంగా చూసినా ఇది 'షోలే' చిత్రానికి 100 రెట్లు గొప్పగా ఉంటుంది. 'మొఘల్-ఎ-ఆజం' నుంచి ఇప్పటివరకు వచ్చిన గొప్ప సినిమాలన్నీ ఈ చిత్రం ముందు టీవీ సీరియళ్లలా కనిపిస్తాయి" అని వర్మ తన పోస్టులో పేర్కొన్నారు.
ఇది పాత సినిమా ప్రపంచాన్ని పూర్తిగా అంతం చేసి, ఒక కొత్త సినీ శకాన్ని ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. "ఇకపై డైరెక్టర్ అనే పదానికి అర్థం ఆదిత్య ధర్ పేరుతో మొదలవుతుంది. స్టీవెన్ స్పీల్‌బర్గ్, క్రిస్టోఫర్ నోలన్ లాంటి వారు కూడా తమ పనులన్నీ పక్కనపెట్టి ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా చూడటం మంచిది" అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బాక్సాఫీస్ లెక్కలపై కూడా వర్మ తన అంచనాను తెలిపారు. ఒకవేళ 'ధురంధర్ 2' చిత్రం రూ. 1,500 నుంచి రూ. 2,000 కోట్లు వసూలు చేస్తే, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న దక్షిణాది చిత్రాల ఆధిపత్యానికి గండి పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.