ఈవీఎంలు మార్చేశారని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా... ఇప్పుడు మద్దత్వివండి!: షర్మిల

ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై జగన్‌కు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్వర్‌పై ‘ఇండియా’ కూటమి ప్రతిపాదించిన అభిశంసన తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. విజయనగరం జిల్లా జామిలో పర్యటించిన ఆమె, ఈ మేరకు వైసీపీ అధినేత జగన్ ను డిమాండ్ చేశారు.

ఎన్నికల్లో ఈవీఎంలు మార్చేశారంటూ వైసీపీ నేతలు ఇప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దానిపై నిజాయతీ ఉంటే తమ ఎంపీలతో అభిశంసన తీర్మానంపై సంతకాలు చేయించాలని షర్మిల అన్నారు. "రాష్ట్రంలో ఈవీఎంలు మారిపోయాయని దొంగ ఏడుపులు ఏడ్చారు కదా. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇండియా కూటమి పెట్టే తీర్మానానికి మద్దతు ప్రకటించాలి. మోదీకి దత్తపుత్రుడు కాదని నిరూపించుకోవాలి" అని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ప్రధాని మోదీ ఎన్నికల సంఘాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారని, రాజ్యాంగ విరుద్ధంగా నడిపిస్తున్నారని షర్మిల ఆరోపించారు. జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, వైసీపీ ఎంపీల మద్దతును వెంటనే ప్రకటించాలని ఆమె స్పష్టం చేశారు.


More Telugu News